Header Banner

ఆపరేషన్ సిందూర్ పై ఐఏఎఫ్ కీలక ప్రకటన! అప్పటి వరకు ఊహాగానాలు ప్రచారం చేయొద్దు!

  Sun May 11, 2025 14:30        Politics

"ఆపరేషన్ సిందూర్"లో భాగంగా తమకు అప్పగించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తిచేశామని భారత వాయుసేన (ఐఏఎఫ్) ఆదివారం ప్రకటించింది. "జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా, అత్యంత కచ్చితత్వంతో, వృత్తి నైపుణ్యంతో ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించాం. కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున, తగిన సమయంలో సమగ్ర వివరాలు వెల్లడిస్తాం. అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వవద్దు" అని ఐఏఎఫ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కోరింది. ఇరు దేశాల మధ్య కాల్పులు, దాడుల విరమణకు శనివారం భారత్, పాకిస్థాన్ అంగీకారానికి వచ్చాయి. అయితే, ఒప్పందం కుదిరిన కాసేపటికే పాకిస్థాన్ సైన్యం మరోమారు సరిహద్దుల్లో రెచ్చిపోయింది. శ్రీనగర్‌తో పాటు గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా కూల్చేసింది. దీంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని భారత్ మీడియాకు వెల్లడించింది. ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పరిస్థితిని బాధ్యతాయుతంగా ఎదుర్కోవాలని పాకిస్థాన్‌కు సూచించారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి ఉల్లంఘనలు పునరావృతమైనా దృఢంగా వ్యవహరించాలని సాయుధ బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli